టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు ఒక్కరోజు గడిపిన ఒక వ్యక్తి…

కధ కల్పితం ఇంకా వాస్తవం కాదు. అలాగే ఎవరినీ, ఏవర్గం వారిని కూడా ఉద్దేశించింది కాదు. ఇంకా ఈ కధలో కేవలం పాత్రల యొక్క భావన వరకు మాత్రమే వస్తువు యొక్క స్థితిని వాడడం జరిగింది.

‘నన్ను టచ్ చేయకుండా ఒక్కరోజు గడుపు చూద్దాం…’ అంటూ ఫోన్ చాలెంజ్ వస్తే… ఎలా ఉంటుంది. ప్రతి రోజూ నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉన్న వారు, టీ త్రాగలేక ఎలా ఉండలేరో…? టచ్ ఫోన్ వాడేవారు కూడా అలాగే ఉంటారు. ఈ కధలోకి వెళ్తే…

రాత్రి గం.9.15 నిమిషాల సమయం: ఆ సమయంలో హైదరాబాద్ లోని అపార్ట్ మెంటులో 5వ ఫ్లోర్ ఇంటి హాలులో టివి మ్రోగుతూ ఉంది. వంటగదిలో ఆఇంటిఇల్లాలు సర్దుకుంటుంది.

తీరిగ్గా భోజనాలు ముగిశాక… వంటిల్లు సర్దుకుంటుందా ఇల్లాలు. ఆఇంటాయన టివి చూస్తున్నాడు. ఆ ఇంటాయన కొడుకు మాత్రం బెడ్రూంలో పడుకుని టచ్ ఫోన్ చూస్తున్నాడు. అలా టచ్ ఫోన్ టచ్ చేసుకుంటూ కూర్చుని ఉన్న అతనికి వచ్చిందో చాలెంజ్…

నన్ను టచ్ చేయకుండా ఉండు చూద్దాం…” అని టచ్ స్క్రీనుపై కనబడింది. వెంటనే ఆలోచించడం మొదలు పెట్టాడు.

‘రోజూ ఉదయం లేవగానే నాకు పోన్ టచ్ చేసి చూడుట నాకు అలవాటు. అందుకే లేవగానే ఫోన్ టచ్ చేసి చూస్తా…! ఇప్పుడు ఈ అలవాటు మానడం అంటే కష్టమే అనుకుంటున్నాడు’
”ఏమిటి చాలెంజ్ చేయలేవా…” అని మరలా టచ్ స్క్రీనుపై కనబడింది.

అతను మరలా ఆలోచిస్తున్నాడు. ‘ఎప్పుడైనా అవకాశం సృష్టించుకోవడం కన్నా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవడం మేలు. అలాగే చాలెంజ్ చేయడం కన్నా చాలెంజ్ ఎదురైనప్పుడు, గెలవడానికి ప్రయత్నించడం మేలైన పని’ వాళ్ల నాన్న చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

వెంటనే ఫోన్ పట్టుకుని వెళ్లి టివి గది దగ్గర పెట్టేసి వచ్చి పడుకున్నాడు. అలా పడుకుని ఆలోచిస్తున్నాడు.

ప్రాణంలేని టచ్ ఫోను, ప్రాణం ఉన్న నామనసును చాలెంజ్ చేస్తుంది. నేను మోసుకెళ్లేగానీ ఎక్కడికి పోలేదు… అలాంటి టచ్ ఫోను నేను టచ్ చేయకుండా ఎందుకు ఉండలేను? అని ప్రశ్నించుకుని.

సరే రేపు ఒక్కరోజు టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అనుకుంటూ పడుకున్నాడు. ఇక తర్వాతి నుండి అతని వైపునుండి చదవండి…

కౌసల్యా సుప్రజా…..రామా.. అంటూ పాటలు వినబడుతుంటే, మెలుకువ వచ్చింది. బెడ్ పై అలాగే పడుకుని… నా చేయిని అటు ఇటు కదుపుతున్నాను. నాచేయికి ఏది అందలేదు. అయ్యో… నా స్మార్ట్ ఫోన్ ఏమయ్యింది…? అంటూ గబాలున పైకి లేచాను. మంచంపై అంతా వెతికాను.. దుప్పటి తీసివేశాను… టచ్ ఫోన్ కనబడలేదు…. ఏమయ్యింది… రాత్రి ఫోన్ ఎక్కడ పెట్టాను? అని కళ్ళు మూసుకున్నాను.

టక్కున లేచి టివి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఫోన్ ఉంది. ఎందుకో… ఫోన్ ముట్టుకోవాలనిపించలేదు. నా దైనందిన కార్యక్రమములు మొదలు పెట్టాను…

బ్రెష్ చేస్తున్న నాకు.. అమ్మ అరుపు వినబడింది. ”ఓరేయ్… నీ ఫోన్ మ్రోగుతుందిరా… చూడు” అని.

బ్రెష్ చేయడం పూర్తయ్యాక… వెళ్ళి చూశాను… టచ్ ఫోన్ రింగవుతుంది. ఫోన్ టచ్ చేయకుండా… ఫోన్ పై కనబడుతున్న కాంటాక్ట్ పేరు చూశా… అంతే… గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడో నేను తీసుకున్న అప్పు గురించి… ఇప్పుడు అడగడానికి…. ఫోన్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్… ఫోన్ ముట్టుకోలేదు.

ఆ అప్పు నా ఫ్రెండుకోసం తీసుకున్నాను. కానీ వాడు కనబడకుండా పోయాడు. నేను ఇవ్వలేకుండా ఉన్నాను. అందుకే ఆ ఫోన్ రింగుకు రిప్లై ఇవ్వలేదు. అమ్మ దగ్గరకు వచ్చి, నన్ను చూస్తూ…

”ఏంట్రా ఆలోచిస్తున్నావ్…” అంది. బదులుగా నేను అమ్మతో

” ఏంలేదు అమ్మా…” అన్నాను… వెంటనే అమ్మ మరలా

”ఎప్పుడూ ఆ టచ్ ఫోన్ పట్టుకుని నొక్కుకుంటూ ఉంటావు. దాన్ని చూసుకుంటూ… నవ్వుకుంటావు కదరా… ఈరోజు అలా లేవు కదరా…. అందుకే అడిగా…” అంది.

”అదేం…లేదు అమ్మ… పని ఉంది… ఈరోజు త్వరగా వెళ్ళాలి.” అన్నాను.

”సరే… టిఫిన్ తినే ఖాళీ అయినా…ఉందా… అంది…” అమ్మ…

నేను టిఫిట్ చేసేసి, రెఢీ అయ్యాను బయటకు వచ్చేస్తున్నాను. ”ఓరేయ్” అంటూ అమ్మ పిలుపు మరలా వినబడింది. అమ్మవైపు చూశాను.

అమ్మ టచ్ ఫోను పట్టుకుని వస్తూ…”దీన్ని మరిచిపోయావురా…” అంటూ ఫోన్ తీసుకువచ్చి నా జేబులో పెట్టింది. ఎందుకంటే ఒక చేతిలో బాక్స్, మరొక చేతిలో ఫైల్స్ ఉన్నాయి. వెంటనే నేను ఆఫీసుకు బయలుదేరాను.

”రారా… ఏంటి… ఈరోజు కొత్తగా కనబడుతున్నావు..” అంటూ నా కొలీగ్ పలకరించాడు. నేను నా వైపు చూసుకుని, ఏంటి అన్నట్టు నా కొలీగ్ ను చూశాను. ”ఏంలేదురా.. ఎప్పుడూ టచ్ ఫోన్ టచ్ చేస్తూ…లోపలికి ఎంట్రీ ఇస్తావు… ఈరోజు ఫోన్ పాకెట్లోనే ఉంది. అందుకే అలా అన్నాను” అన్నాడు.

”ఏటచ్ ఫోన్ టచ్ చేసి చూడకపోతే, ఆఫీసులో అడుగుపెట్టకూడదా…” అనేసి, నాసీటులోకి కూర్చున్నాను.

ఇంతలో ఫ్యూన్ వచ్చి.. ”మేనేజరుగారు రమ్మంటున్నారు” అని చెప్పాడు. వెంటనే నా టేబిల్ పై ఉన్న ఫైల్స్ కట్టను రెండు చేతులతో పట్టుకుని మేనేజరు రూముకి దారితీస్తుంటే, నా కొలీగ్.. ”ఒక్కసారి నీ టచ్ ఫోన్ ఇవ్వు… కొంచెం కాల్ చేయాలి” అన్నాడు.

నేను నా జేబులో నుండి తీసుకోమని సైగ చేశాను. నా కొలీగ్ నాజేబులో నుండి టచ్ ఫోన్ అందుకుని టచ్ చేయడం మొదలుపెట్టాడు. నేను మేనేజర్ రూంలోకి దూరాను.

”ఇటు చూడు… నీవు ఏంచేస్తావో తెలియదు… నాకు నాపని పూర్తికావాలి. ఈరోజు ఇవ్వన్ని కంప్లీట్ చేస్తేనే… నీ ఉద్యోగం ఉంటుంది. లేకపోతే ఉండదు… బాగా ఆలోచించుకో… పని మొదలు పెట్టాక పూర్తికాకపోతే… నీ ఉద్యోగం ఉండదు. పని మొదలుపెట్టలేనని చేతులెత్తేస్తే… డిమోషన్, పని పూర్తి చేస్తే ప్రమోషన్…” అన్నాడు.

నాకు దిమ్మ తిరిగింది. ఇలాంటి టచ్ ఇచ్చాడు. ఈ మేనేజర్ అనుకుంటూ… ”ప్రయత్నం పురుషలక్షణం కాబట్టి ప్రయత్నం చేయడమే ఉత్తమమైనది, ప్రకృతి ఇచ్చన అవకాశం అందుకోవడానికే ప్రయత్నం చేయాలి” అన్న నాన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మేనేజరుతో

”పూర్తి చేస్తాను… సర్” అని అక్కడ నుండి బయటకు వచ్చేశాను.

నా కొలీగ్ దగ్గరకు వెళ్ళాను… వాడు నా ఫోన్ ఇవ్వబోయాడు. వెంటనే వాడితో… ”ఒరేయ్… ఈరోజు నాకు హెల్ప్ చేస్తే, ఈ టచ్ ఫోన్ నీకు ఇచ్చేస్తాను.” అన్నాను. ”ఏం హెల్ప్ చేయాలి… రా” అన్నాడు.

”నాకు ఏ ఫోన్లు వచ్చినా… నేను లేను ఊళ్ళో లేను అని చేప్పేసేయ్…” అన్నాను. దానికి వాడు… ”ఓస్… ఇంతేగా… సరే… కానీ ఫోన్ ఇప్పటి నుండి నాదేరోయ్..” అన్నాడు… నేను అలాగే అన్నాను.

ఆఫీసర్ అవకాశం ఇచ్చాడు. కానీ పని పెద్ద పనే… కానీ నేను పూర్తి చేయాలంటే, చాలా ఏకాగ్రత అవసరం అందుకే నా కొలీగ్ కు టచ్ ఫోన్ అంటగట్టేశాను. ఇక నా పనిలో నే నిమగ్నమయ్యాను.

మెల్లగా సాయంకాలం అయ్యింది…. నా కొలీగ్ నా టచ్ ఫోనుతో బిజిగా ఉన్నాడు. నేను నా పనిని చేసుకుంటున్నాను. ఆఫిసర్ నా కొలీగ్ వద్దకు వచ్చాడు.

”ఏంటయ్యా… ఈ ఫైల్” అంటూ ఒక పింక్ కలర్ ఫైల్ నా కొలీగ్ టేబిల్ పై పడేశాడు. నా కొలీగ్ ఫైల్ అందుకుని అందులో చూశాడు. వెంటనే ఆఫీసర్ వంక దీనంగా చూశాడు. ఆఫీసర్ అతనిని చూస్తూ…

”రూపిస్ అని వ్రాయవలసిన చోట, కాయిన్స్ అని వ్రాశావు… వడ్డీ అని వ్రాయవలసిన చోట, బోనస్ పాయింట్స్ అని వ్రాశావు… ఎక్కడ పెట్టావు నీ మైండ్…” అంటూ తిట్లపురాణం మొదలుపెట్టాడు.

కాసేపటికి నా పనిని ముగించుకుని మేనేజర్ రూములోకి వెళ్ళాను. మేనేజర్ నా పనిని మెచ్చుకున్నాడు. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఆఫీసులో నుండి బయటకు వచ్చేస్తుంటే, నా కొలీగ్ వచ్చి… నా టచ్ ఫోన్ నాకు ఇవ్వబోయాడు. వెంటనే నేను
”అదేమిట్రా… ఈ ఫోన్ నీకే…ఇక నీదే నువ్వే తీసుకో… ”అన్నాను. అప్పుడు వాడు..

”అమ్మో వద్దురా.. ఇన్నాళ్ళు… నీవు టచ్ ఫోన్ వాడుతుంటే, మానాన్నను ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవాడిని… సంపాదించేవాడికి కూడా రూల్స్ పెడతాడు… చెత్తనాన్న అనుకునేవాడిని. ఒక్కరోజు ఈ టచ్ ఫోన్ మాయలో పడితే, ఫలితం ఎలా ఉంటుందో… తెలిసింది..” అంటూ ఫోన్ ఇవ్వబోయాడు. వెంటనే.. నే…

”అది కాదురా… తర్వాత అయినా ఫోన్ కొనుక్కుంటావు… కదా. ఈ టచ్ ఫోన్ ఉంచేసుకో.. ఈరోజు ఇలా జరిగితే, ఎప్పుడూ ఇలా జరుగుతుందా… ఏమిటి” అన్నాను. అందుకు వాడు టచ్ ఫోన్ నా జేబులో పెట్టేసి…

”ఓరేయ్… నాకు నీ ఫోన్ మీద కోపం కాదు… ఈ రోజు సంఘటన జరిగాకా బాగా ఆలోచించాను. మానాన్నగారు టచ్ ఫోన్ వాడుతున్నారు. కానీ నాకు టచ్ ఫోన్ ఇవ్వలేదు. నాకు మానాన్నగారు ఎందుకు టచ్ ఫోన్ ఇవ్వలేదో అర్ధం అయ్యింది. ఎప్పుడు మానాన్నగారు టచ్ ఫోన్ వాడమంటే, అప్పుడే టచ్ ఫోన్ టచ్ చేస్తాను…” అని అక్కడి నుండి కదిలాడు.

నేను కదిలి ఇంటికి బయలుదేరాను. నాకు ఒకప్రక్క సంతోషం, మరొక ప్రక్క బాధ కలిగాయి. ప్రమోషన్ రావడం సంతోషం అయితే నాకొలీగ్ చివాట్లు తినడం బాధగా ఉంది. అదీ నావలన… నాఫోన్ వాడడం వలనే కదా.. వాడు తిట్లు తిన్నాడు.. అని ఆలోచిస్తుండగానే ఇంటికి దగ్గరకు వచ్చేశాను.

ఇంట్లోకి వస్తున్న నన్ను మా అమ్మ ఆశ్చర్యంగా చూసింది. నేను మా అమ్మను చూసి.. ”ఏంటమ్మా… అలా చూస్తున్నావ్..” అన్నాను.

”ఏంట్రా… నాన్న ఏమయ్యింది…” అని తల నిమిరింది…

”ఏంటమ్మా…” అన్నాను.

”అది కాదురా… టచ్ ఫోను టచ్ చేస్తూ నిద్ర లేస్తావు… టచ్ ఫోన్ టచ్ చేస్తూ ఎప్పుడూ కనబడతావు… ఈరోజు దాని గోల లేదంట్రా…” అంటూ ఫోన్ తీసి టివి దగ్గర పెట్టింది.

”అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది” అని చెప్పా…

”మంచి విషయం చెప్పావురా…కంగ్రాట్స్ ” అని స్నానం చేయమంది.

నేను స్నానం చేసి, కాసేపు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వచ్చాను. అప్పటికి టైం ఎనిమిది దాటుతుంది.
అమ్మ బోజనం చేయడానికి పిలిచింది. అమ్మ బోజనం పెడుతుంది. ”అమ్మా ఫోన్స్ ఏమైనా వచ్చాయా..?” అన్నాను. ”లేదురా…” అంది.

”ఓరేయ్ నాన్న… ఈ రోజు ఉన్నట్టే రోజూ ఉండరా… ఎప్పుడైనా అవసరం అయితేనే ఆ టచ్ ఫోన్ టచ్ చేయరా… లేకపోతే… అదొక క్రెడిట్ కార్డు అనుకోరా… అంతేకానీ అదే పనిగా మంచినీళ్ళు త్రాగినట్టుగా టచ్ ఫోన్ టచ్ చేయకురా… టీ త్రాగినట్టుగా టచ్ ఫోన్ తాకరా…” అని అంది… నా బోజనం పూర్తయ్యింది.

నేను బెడ్రూంలోకి వెళ్తుంటే, అమ్మ టచ్ ఫోన్ తీసుకుని నా చేతికి ఇచ్చింది. నేను ఫోన్ అందుకున్నాను. అప్పుడాలోచన వచ్చింది. సరిగ్గా నేను ఫోన్ పట్టుకుని 24గంటలు గడిచిందని.

ఫోన్ తీసుకుని బెడ్రూం లోపలికి వచ్చేశాను. గబ గబా ఫోన్ పైబాగంలో మొబైల్ డేటా ఆన్ చేశాను. వెంటనే 4జి సిగ్నల్ వచ్చింది. వెంటనే వెంటనే మెసెజ్ టోన్స్ వినబడుతున్నాయి. పదుల సంఖ్యలో మెసేజులు వచ్చాయి.

నేను ఆ మెసేజులు చూడకుండా వాట్సప్ ఓపెన్ చేశాను. అందులో వాట్సప్ చాట్ మెసేజుల పంపిన కాంటాక్టులు స్క్రోల్ చేస్తున్నాను. టచ్ ఫోన్లో వాట్సప్ కాంటాక్టులలో ఒక కాంటాక్ట్ పై టచ్ చేసి చాట్ మెసేజింగ్ లోకి వెళ్ళాను.

‘YOU ARE WINNER” అని టెక్స్టు మెసేజ్ వచ్చింది. అప్పుడు గుర్తుకు వచ్చింది.. నాకు రాత్రి సుమిత్ర చేసిన చాలెంజ్… వెంటనే ఆమెతో చాట్ చేయడం మొదలు పెట్టాను.

అలా ఒక్కరోజు టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఆ వ్యక్తికి ఒక్కరోజు గడవడానికి పరిస్థితలు కలిసి వచ్చాయి… అతనికి దృష్టి పనిమీదేకే వెళ్ళడానికి కారణం పడుకునే ముందు బలంగా మనసులో సంకల్పం చేయడమే…

తెలుగుస్టోరీస్

తెలుగురీడ్స్

తెలుగురీడ్స్ బ్లాగ్