టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ లోనూ కరోనా ప్రభావమే కనబతుంటే, ఈ మహమ్మారి పోయేకాలం ఎప్పుడు?

రాశి  స్కూల్ ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా రోజుల తర్వాత  వీడియో గ్రూప్ చాటింగ్ చేస్తున్నారు

హాయ్ రాశీ  ఎలా ఉన్నావు ? చాలా రోజులయ్యింది నిన్ను చూసి -కావ్య

అబ్బ ఈ కరోనా ఏమో కానీ పిచ్చి లేస్తుందే-శృతి

ఎక్కడకైనా చెప్పకుండా పారిపోవాలన్పిస్తున్నది -ఆమని

మూసిన తలుపులు మూసినట్లే ఉంటున్నాయి -తేజస్విని

చెప్పు ఇంకా సంగతులేంటి ?- ధనుశ్రీ

వర్క్ ఫ్రం హోం ఎలా చేస్తున్నావు ?

ఓ అర్ధం అయిందిలే  కాబోయే వాడితో చాటింగ్ లు వీడియో లు ఎక్కువయ్యయా ?

అవునూ నీ పెళ్లి పోస్ట్ పోను అయ్యిందట కదనే ఏమైంది అసలు -స్వాతి ఆందోళన

మీ కజిన్ పోతే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడుట కదా మీ నాన్న ఆయన ఎట్లా ఉన్నారు ? శ్రావిక ఆరాటం.

మీ మదర్ స్కూల్ కి ఎలా వెళుతున్నారు , ఆ స్కూల్ లో కొంతమంది  పిల్లల కి పాజిటివ్ వచ్చిందిట కదా, న్యూస్ లో చూసాము . మీ మదర్ టెస్ట్ చేయించు కున్నారా పూజ పలకరింపు.

మీ తమ్ముడు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాడుట కదా మరి ఈ కరోనా టైం లో ఏమి చేస్తున్నాడు వాడు -మేఘన

ఆ కోపం ఇంట్లో చూపిస్తున్నాడు

ఏమి చెయ్యాలే మరి , అలా ఉండటమే ; అమ్మ కి వంటలో సహాయం చేస్తున్నాను ,

నేను ఆస్ట్రేలియా లో ఉన్న అన్నయ్య, వదిన తో మాట్లాడుతున్నాను .

ఇంకా పైథాన్ నేర్చుకుంటున్నాను , మా ఇంటి బాల్కనీ లో కొన్ని పక్షులు ఎప్పుడన్నా వస్తాయి.  వాటిని చూస్తూ అవి ఎగిరేలోపులో   ఫొటోస్ తీస్తూ టైం పాస్ చేస్తున్నాను .

ఆన్ లైన్ లో మాథ్స్ టీచ్ చేస్తున్నాను

నేను మా ఇంట్లో కుండీలు తెచ్చి మొక్కలు పెంచుతున్నాను.

మా తమ్ముడి తో పజిల్సు  ఆడుతున్నాను

నేనేమో మా అమ్మమ్మ చిన్నప్పటి సంగతులు తెలుసుకుంటున్నాను

నేను యు ట్యూబ్ లో చూసి హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాను .

ఈ కరోనా లో నా జాబ్ పోతే “వంటింట్లో నేను”  అని యుట్యూబ్ లో పాస్ వీడియోలు  పెడుతున్నాను

నేను అమ్మ దగ్గర మిషన్ నేర్చుకుంటున్నాను

మా నాన్న చెస్ ప్లేయర్ ట నాకు తెలియదు , నేను కూడా చెస్ నేర్చుకుంటున్నాను

మా అమ్మ చాలా బాగా పాడుతుంది . అమ్మ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను

మా అమ్మ లలితా సహస్రాలు , విష్ణు సహస్రాలు నేర్పిస్తున్నది

మా తాత కి పాజిటివ్ వచ్చింది ఇంక మా ఫ్లాట్ టోటల్ ఐ సోలేటేడ్ అయింది -రాశి

ఇంత కూల్ గా మాట్లాడుతున్నావు ఏంటే రాశీ , ఇంట్లో పాజిటివ్ పెట్టుకొని -భయపడిపోతూ అడిగింది వర్ష ,రాశి ని.

ఏమి చేస్తామే అట్లా అయితే మొన్న మా నాన్న, అమ్మా ఇద్దరూ పది రోజులు హాస్పిటల్ లో నే ఉన్నారు

గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అందరం హాయిగా ఉన్నాము లే.

మా కజిన్ కూడా కరోనా  తో పోట్లాడి గెలిచాడే

మా తాతయ్య అయితే ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకొని కూర్చుంటాడు

మరి ఊపిరి ఎట్లా ఆడుతుందే నాకు తెలియదు అస్తమానం మూతికి గుడ్డ పెట్టుకుంటే, మా నాన్న అయితే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే డైరెక్ట్ గా బాత్ రూమ్ కి వెళతాడు

ఇంకా మా  అమ్మ ఏంటో నే , దుమ్మూ – ధూళి అంటే భయపడుతుంది. మా అమ్మ భయం మా అమ్మది  , పోయిన సంవత్సరము మా మామయ్య కరోనా తో నే చనిపోయాడు పాపం అందుకే మా అమ్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది .

అలా మా ఇంట్లో అయితే బయట వారు ఎవరయినా వస్తే మేము మాస్క్, గ్లోవ్స్ వేసుకొని  కిందకెళ్ళి మాట్లాడి వస్తాము . లోపలికి రాగానే చేతులు కడుక్కోవడం ముఖ్యం అనుకో .

ఇంక చాల్లే పిచ్చాపాటి కబుర్లు , చేతులు కడుక్కొని భోజనానికి రా అని అమ్మ అరుస్తున్నది

మళ్ళీ కలుద్దాము అని బై  చెప్పింది -రాశి

తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్