తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి శీర్షికన తెలుగు కధ..

ఈ స్టోరీ కేవలం కల్పితం… ఎవరిని ఉద్దేశించింది కాదు… కేవలం ఒక కధగానే చూడగలరు. అలవాటు ముదిరి వ్యసనంగా మారకూడదని అంటారు.

అలవాటుగా ఉన్నంతసేపూ అది మనసుకు సంతోషం… అలవాటు వ్యసనం అయితే తనతోటివారికి కష్టం. తన శరీరమునకు నష్టం..

అలవాటును అలవాటుగానే ఉంచాలంటే బలనమైన సాధన ఉండాలి.. అప్పడే అలవాటు అలవాటుగానే ఉంటుంది… వ్యసనంగా మారదు…

ఒక తాత టీ అలవాటు….. మనవడి స్వీట్స్ పేచికి సంబంధం పెట్టుకుంటూ సాగే సంభాషణల తెలుగు స్టోరీని రీడ్ చేయండి…

ఉదయం 8గంటలు కావొస్తుంది… వీధి రోడ్డు ప్రశాంతంగా ఉంది… ఆ రోడ్డుపై అప్పుడప్పుడు వెళ్లే మోటారు వాహనాలు మాత్రమే శబ్దాన్ని చేస్తూ ఉంటాయి… అంతగా శబ్దకాలుష్యం ఉండని వీధిలో రోడ్డు ప్రక్కనే ఒక ఇల్లు.

ఇంట్లో నలుగురు వ్యక్తులు ఒక అరవైఆరేళ్ల పెద్దాయన. ఆ పెద్దాయన పేరు పరంధామయ్య. ఆ పరంధామయ్యగారికి ఒక కొడుకు, అతని పేరు చంద్రశేఖర్. ఆ శంకర్ కి గౌరితో పెళ్లి అయి, పదేళ్ళ అయింది… వారికి ఎనిమిదేళ్ళ బాలుడు. ఆ బాలుడి పేరు… విఘ్నేష్.

గౌరి వంటపనిలో బిజిగా ఉంది. శంకర్ ఆదివారం కూడా ఆఫీసుకు వెళ్ళడానికి రెఢీ అవుతున్నాడు. విఘ్నేష్ పుస్తకాలు పట్టుకుని కుస్తీ పడుతున్నాడు…. ఎవరిపనిలో వారు ఉన్నారు. పరంధామయ్యగారు పేపర్ చదువుతున్నారు.

వంట చేస్తున్నా… గౌరి, పేపర్ చదువుతున్న పరంధామయ్యగారి దగ్గరకు వచ్చి, ”టీ తాగుతారా…” అని అడిగింది. ”వద్దమ్మా…” అంటూ పరంధామయ్య బదులివ్వడంతో ఆమె హాలులోకి వచ్చింది… పుస్తకాలతో కుస్తీపడుతున్న విఘ్నేష్ ను చూసి… ”ఓరేయ్… టిఫిన్ చేద్దువుగాని… రా..” అంది.. వాడు బదులు చెప్పకుండా అలానే పుస్తకాలలో మునిగిపోయాడు… గౌరి విఘ్నేష్ తలపై చిన్నగా ఒక మొట్టికాయ మొట్టి… ”లేవరా… టిఫిన్ చేసి…. చదువుకో..” అంది.

విఘ్నేష్ తాతయ్యతో సంభాషణ

దెబ్బ తగలకపోయినా… అమ్మ కొట్టిందనే సాకుతో… విఘ్నేష్ ఏడుపు స్టార్ట్ చేశాడు… అంతే శంకర్ వచ్చి.. గౌరిపై సీరియస్ అయ్యాడు. విఘ్నేష్ అక్కడి నుండి పరంధామయ్య దగ్గరకు వచ్చాడు. పేపర్ చదువుతున్న పరంధామయ్య, కళ్ళునలుపుకుంటూ తన దగ్గరకు వస్తున్న విఘ్నేష్ ను.. చూశాడు.

”ఏంట్రా… వినాయకా… అలా మొఖం పెట్టావు” అని అడిగాడు..
”అమ్మకొట్టింది… తాతయ్యా..” అంటూ బదులిచ్చాడు. వెంటనే పరంధామయ్య… వాడితో… ”నువ్వు పుస్తకాలు పట్టుకుని ఏంచేశావు..” అని అడిగాడు..
”చదువుకుంటున్నాను… తాతయ్యా…” అంటూ బదులిచ్చాడు.

దానికి పరంధామయ్య.. విఘ్నేష్…తో ఇలా

”చూడు వినాయకా… నువ్వు మంచి పిల్లవాడివి… మంచి పిల్లలు అబద్దాలు చెప్పరు.. నిజం చెప్పు గణేశా…” అన్నాడు…
”తాతయ్యా… నాపేరు విఘ్నేష్… నువ్వు ఒక్కోసారి ఒక్కోపేరుతో ఎందుకు పిలుస్తావు?” అన్నాడు..
”నేను ఎలా పిలిచాను.. అని కాదు…రా గణపతి… నీవు నిజం చెప్పు… పుస్తకాలతో ఏంచేశావు…?” అని అడిగాడు. అప్పుడు విఘ్నేష్ బుర్ర గోక్కుంటూ… పరంధామయ్యతో …
”స్వీట్స్… తింటున్నాను…పొద్దుటే స్వీట్స్ తినవద్దని చెప్పానా? అంటూ మొట్టికాయ వేసింది..” అని చెప్పాడు. వెంటనే పరంధామయ్య… విఘ్నేష్…ను దగ్గరకు తీసుకుంటూ…
”నాన్న… విఘ్నేశా… స్వీట్స్ అదేపనిగా తినకూడదు… అవి అతిగా తింటే అనారోగ్యం… అందుకే అమ్మ తిట్టింది…” అనగానే… పరంధామయ్యతో.. కుర్రాడు…
”తాతయ్య… నేను మూడంటే.. మూడు స్వీట్స్ తిన్నాను…అంతే తాతయ్యా..” అన్నాడు.
ఈ లోపు శంకర్ గౌరిని తిడుతున్న పని ముగించుకుని… ఆఫీసుకు బయలుదేరుతూ… పరంధామయ్య దగ్గరకు వచ్చి… ”ఆఫీసుకు వెళ్లి వస్తాను.. నాన్న” అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు.
”అది కాదురా… నాన్న… పొద్దుటే స్వీట్స్ ఎక్కువగా తినకూడదు… నాన్న పొద్దుటే బలమైన పదార్ధములు తినాలి” అన్నాడు..
”నేను ప్రొద్దుటే స్వీట్స్ తినకుండా ఉండలేను… ఒక్కటి అన్నా తినాలి… తాతయ్య… ” అని పరంధామయ్యతో… విఘ్నేష్ పలికాడు.
”సరే… ఈరోజు ఆదివారం కదా… ” అన్నాడు.
”అవును తాతా… అదివారం కదా… నేను నా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఆడుకుంటాను” అని విఘ్నేష్ అక్కడి నుండి బయలుదేరబోయాడు…
”ఆగరా మనవడా… నేనూ వస్తాను… సెంటరు నుండే కదా నీవు నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళేది… ” అన్నాడు.
ఇంతలో గౌరి అక్కడకు వచ్చి పరంధామయ్యతో ”మామయ్యగారు టిఫిన్ చేశారు కానీ.. టీ త్రాగలేదు…” అంది…

తాతామనవడు వీధిలోని రోడ్డుపై నడక

”ఇప్పుడు వద్దులే.. అమ్మా..” అని చెప్పి… విఘ్నేష్, పరంధామయ్యలు ఇద్దరూ.. వీధిరోడ్డెక్కారు.
ఇద్దరూ వీధి రోడ్డుపై నడుస్తున్నారు… వీధిలో పెద్దగా జనాలు ఎవరు లేరు… ప్రశాంతంగా ఉంది.. మెల్లగా మాట్లాడుకున్నా వినిపించేటంతగా వీధి ప్రశాంతంగా ఉంది… అటువంటి వీధిలో తాతామనవడు నడకసాగిస్తున్నారు. అలా నడుస్తుండగా విఘ్నేష్ కు ఒక సందేహం వచ్చింది… వెంటనే పరంధామయ్యతో….
”కారణం లేకుండా కదలకూడదని అంటావు… కదా.. నేనైతే ఆడుకోవడానికి వెళుతున్నాను… నీవెందుకు, ఎక్కడికి వెళుతున్నావు?” అని నడుస్తూనే, తనతో నడుస్తున్న పరంధామయ్యను అడిగాడు..
టీ త్రాగడానికిరా…” అన్నాడు.

”అదేమిటి.. టీ ఇంట్లో అమ్మ ఇస్తానంది… కదా.. ఇప్పుడు వద్దన్నావు.. మరలా టీ త్రాగడానికి అంటున్నావు” అంటూ… నడుస్తున్న విఘ్నేష్ పరంధామయ్యను క్వశ్చన్ మార్కు మొఖంతో చూశాడు.

”ఓరేయ్… సెంటర్ వచ్చింది.. నువ్వు వెళ్ళు.. మీ ఫ్రెండ్స్ దగ్గరకు…” అని చెప్పి… పరంధామయ్య… విఘ్నేష్ ను ఆటలకు పంపించేశాడు. పరంధామయ్య టీ త్రాగి తిరిగి ఇంటికి చేరుకున్నాడు…

సమయం మధ్యాహ్నం దాటి మూడు గంటలు కావొస్తుంది… ఆదివారం ఆఫీసులో అర్జెంటు పని పూర్తి చేసుకుని వచ్చిన శంకర్ భోజనం చేసి పడుకున్నాడు…. అలాగే మిగిలినవారు కూడా భోజనాలు ముగించారు… పరంధామయ్య పడక కుర్చిలో కూర్చొని పడుకుని ఉన్నాడు…. భోజనం చేసి పడుకున్న విఘ్నేష్ నిద్రలేస్తుండగా, పక్కింటావిడాతో కబుర్లు ముగించుకున్న గౌరి ఇంట్లోకి వచ్చింది…

అమ్మతో విఘ్నేష్ సంభాషణ

అప్పుడే నిద్రలేచిన విఘ్నేష్ మొఖం కడుక్కుని కూర్చున్నాడు. గౌరి విఘ్నేష్ దగ్గరకు వచ్చి, ప్రక్కనే కూర్చుంది.. వెంటనే విఘ్నేష్ అమ్మవైపు తిరిగి…
”అమ్మా… నీకు టీ పెట్టడం… చేతకాదా?” అని అడిగాడు.
”ఏరా… నీవు టీ త్రాగవు… కదా… నీకెందుకు? ఆ డౌట్” అంది.
”అది కాదమ్మా… ఉదయం నీవు తాతయ్యకు టీ ఇస్తానన్నావు కదా…” అని ప్రశ్నార్ధకంగా అమ్మ మొఖంలోకి చూశాడు..విఘ్నేష్..
అవునన్నట్టుగా గౌరి తల ఊపింది…
”అయితే తాతయ్య… వద్దని అన్నాడు… కదా” మరలా అమ్మను చూస్తున్నాడు…
”అవున్రా… నేను టీ ఇస్తాను.. అంటే, తాతయ్య ఇప్పుడు త్రాగను అన్నారు…ఇప్పుడేమయ్యింది..?” అని అంది…
”కాదమ్మా… ఇక్కడ టీ త్రాగని తాతయ్య… సెంటరులో టీ ఎందుకు త్రాగారు? అంటే నీవు పెట్టే టీ తాతయ్యకు నచ్చలేదా?” అని అడిగాడు…
”ఓరేయ్… మీ తాతయ్య, నా టీ నచ్చక కాదు… టీ త్రాగడం మానేయాలని… ఇంట్లో టీ త్రాగడం మానేశారు…” అంది… అప్పుడు విఘ్నేష్ ప్రశ్నార్ధకంగా అమ్మను చూస్తూ….
”ఇంట్లో టీ త్రాగకపోతే, టీ మానేసనట్టేనా? బయటకు వెళ్ళి త్రాగవచ్చా?” అని అడిగాడు…
”అది…కాదు…రా నాన్న… నీకు స్వీట్స్ ఎలా ఇష్టమో? మీ తాతయ్యకు టీ అలాగే ఇష్టం… కాబట్టి… టీ ఎక్కువగా త్రాగకూడదని ఇంట్లో త్రాగడం మానేశాడు.. బయటకు వెళ్ళి ఒక్కసారే టీ త్రాగుతారు..” అంది..
అమ్మ వైపు అమాయకంగా చూస్తూ… ”అర్ధం… కాలేదమ్మా… మానేస్తే, మొత్తాని మానేయాలి…కానీ బయట త్రాగడం, ఇంట్లో మానేయడం ఏమిటమ్మా…?” అన్నాడు
ఈలోపులో శంకర్ నిద్రలేచి… ”ఏమోయ్… టీ పెట్టావా?” అని ప్రశ్నించాడు..

పరంధామయ్య కండిషన్ మనవడి పరుగులు

”ఓరేయ్… ఆపరా నీ ప్రశ్నాపత్రం… నాన్నగారికి టీ టైం అయ్యింది…” అంటూ వంటగదిలోకి దారితీసింది… నిద్రపోతున్నట్టుగా ఉన్న పరంధామయ్యసంభాషణంతా ఆలకించాడు… అలా… సమయం సాయంకాలం అయ్యింది…
పరంధామయ్య కుర్చిలో కూర్చుని ఉన్నాడు… ఆయనకెదురుగా టీపాయ్ పై స్వీట్స్ ఉన్నాయి. నిదానంగా విఘ్నేష్ అక్కడికి వచ్చాడు.. వచ్చిన విఘ్నేష్ ను గమనించిన పరంధామయ్య ఏంట్రా… స్వీట్స్…కావాలా? అన్నాడు…

”ఇవ్వు తాతయ్య… తినేస్తాను..” అన్నాడు..
”ఇస్తాను… కానీ ఒక కండిషన్…” అన్నాడు… విఘ్నేష్ బుర్ర గోక్కుంటూ… ”ఏమిటి… తాతయ్య…” అన్నాడు.

”ఒక్క స్వీటు అయితే ఇప్పుడే తీసుకో… మూడు స్వీట్స్ అయితే పాతికరౌండ్లు ఇంటిచుట్టూ పరిగెత్తితే… ఇస్తాను” అన్నాడు…వెంటనే విఘ్నేష్… ఇంటిచుట్టూ పరిగెత్తడం ప్రారంభించాడు… ఒకటి..రెండూ…మూడు.. నాలుగైదు…. పదహారు… రౌండ్లు పరిగెత్తి… రొప్పుతూ తిరిగి తాతయ్య దగ్గరకు వచ్చాడు…
”వద్దు తాతయ్య.. అలసిపోయాను…” అన్నాడు…. దానికి తాతయ్య… మూడు స్వీట్స్ విఘ్నేష్ కు ఇచ్చేసి ”మూడు తినేయరా… కానీ పదే పదే మరలా స్వీట్స్ జోలికి పోకు..” అన్నాడు..

తాతయ్యతో మనవడి సంభాషణ, తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

స్వీట్స్ తింటూ విఘ్నేష్… పరంధామయ్యతో… ”తాతయ్యా… నీవు ఇంట్లో అమ్మ ఇచ్చే టీ వద్దని, సెంటరులో ఎందుకు తాగావు?” అన్నాడు. వెంటనే… పరంధామయ్య.. ”నీవు పాతిక రౌండ్లు పరిగెత్తకుండా మద్యలోనే మానేసి, ఒక్కస్వీటు చాలని ఎందుకు అన్నావు?” అన్ని ప్రశ్నించాడు…
”పొద్దుట నుండి… బాగా ఆడి ఆడి ఉన్నాను.. కదా అందుకే ఇప్పుడు పరిగెత్తలేకపోయాను.. అందుకే ఒక్క స్వీటు కోసం ఒప్పుకున్నాను.” అన్నాడు…

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి
తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

”చూశావా అంతకుముందు మూడు స్వీట్లు కోసం ఎదురుచూశావు… కష్టపడలేక అలసిపోయేసరికి దొరికినదానితో తృప్తి పడదామని అనుకున్నావు… అలాగే నాకు టీ అలవాటును కూడా నేను నడక అనే బలమైన సాధనతో అడ్డుకట్ట వేశాను..” అన్నాడు…
అర్ధం కాక తనవైపే చూస్తున్న మనవడితో పరంధామయ్య…
”ఇప్పుడు మీ అమ్మ ప్రొద్దుటే నాకు టీ ఇస్తాను…అంది…కదా?” విఘ్నేష్ ని ప్రశ్నించాడు, పరంధామయ్య..
”అవును”
”అప్పుడు టీ వద్దన్నాను…అయినా కాసేపటికి మరలా టీ త్రాగుతారా? అని అడిగిందా?” మరలా ప్రశ్నించాడు.. పరంధామయ్య…
”అవును… రెండు మూడు సార్లు అడిగింది…” అంటూ విఘ్నేష్ బదులిచ్చాడు.
”మొదటి సారి నేను టీ త్రాగితే, రెండవసారి కూడా మీ అమ్మ వచ్చి నన్ను ‘టీ త్రాగుతారా…’ అని కాసేపటికి అడుగుతుందా…? అడగదా…?” అన్నాడు..
”అడుగుతుంది…” బదులిచ్చాడు…విఘ్నేష్… అలా అనగానే
”అంటే నేను రెండు సార్లు వద్దన్నాను కాబట్టి… ఇంట్లో టీ త్రాగలేదు..” అన్నాడు…
”మరి బయటకు వెళ్ళి ఎందుకు త్రాగావు…?” అని ప్రశ్నించాడు…
”బయటకు వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి… అంటే ఒక్కసారి నడవగలను కానీ రెండు మూడు సార్లు నడవలేను…కదా” అన్నాడు… పరంధామయ్య… వెంటనే విఘ్నేష్ నవ్వుతూ..
”పిచ్చి తాతయ్య ఒక్కసారే ఇంట్లో త్రాగి ఊరుకోవచ్చు… కదా” అన్నాడు… వెంటనే…నీకు
”మీ మేనత్త పంపించిన స్వీట్స్ ఉన్నాయి… తింటావా?” అని అడిగాడు…
”అమ్మో… తాతయ్య… అత్త చేసిన స్వీట్స్ వద్దు… తాతో… వద్దు..” అన్నాడు…
”మరి మీ అమ్మ చేసిన స్వీట్స్ ఎందుకు తింటున్నావు…?” అన్నాడు..
”బాగుంటాయి…కాబట్టి…” అని బదులిచ్చాడు విఘ్నేష్
వెంటనే పరంధామయ్య…” అలాగే రుచిగా ఉన్న టీ త్రాగి మరలా మరలా టీ త్రాగడం కన్నా… బయటకు కష్టపడి వెళ్ళి ఒక్క టీ త్రాగితే… దాని మీద ధ్యాస ఉండదు… అందుకే బయటకు పోయి టీ త్రాగుతాను” అన్నాడు…

ముగింపు

”ఓహో… ఒక్క టీ త్రాగి సరిపెట్టుకోవడానికి… నీవు ఇంతకష్టపడుతున్నావా…?” అన్నాడు… విఘ్నేష్…
”అవున్రా వినాయకా… బలహీనతను బలమైన సాధన ద్వారా కట్టడి చేస్తున్నాను… ఒక్కరోజు కాకుండా రోజు చేయడం వలన మొదట్లో ఇబ్బందిగా ఉన్నా… కొన్నాళ్ళకు టీ మీద ధ్యాస తగ్గి, రోజు నడవడం కోసం ఒక్క చెత్త టీ త్రాగుతున్నాను…” అని అన్నాడు…

అప్పుడప్పుడే ఆలోచనలు పెరుగుతూ, ఏడపులు ఆపే స్టేజిలో అర్ధం చేసుకోవడం అంత కష్టం కాబట్టి… అర్దం అయి అయినట్టుగా విఘ్నేష్ తలాడించుకుంటూ… మండే స్కూలుకు కోసం… ప్రిపేర్ కావడం ప్రారంభించాడు…

ధన్యవాదాలు తెలుగు స్టోరీస్

తెలుగురీడ్స్ హోమ్