సరిత మనసు సరితదే

వ్యక్తిత్వాలు కాలంలో మార్పుకు గురి అవుతాయి. అలా సరితా అనే అమ్మాయిలో మార్పు కాలంలో కలిగితే, సరిత మనసు సరితదే తెలుగులో స్టోరీ రీడ్ చేయండి.

సుజానామాల్ లో తన డ్రైవర్  కవల పిల్లల  మొదటి బర్త్ డే కి గిఫ్ట్స్ చూస్తున్నది సరిత.

ఒక పెద్ద కంపెనీ లో మేనేజర్ గ పని చేస్తున్నది.  వళ్ళంతా అందం ,చేతి నిండా డబ్బు, అహంకారం ఆమె ఆభరణాలు.

హలో సరితమ్మా ,ఎలా ఉన్నారు ?  గుర్తు పట్టారా?  అయోమయంగా చూసింది సరిత ఆమె వైపు.

నేనండీ మీరు విశాఖపట్నం లో ఉన్నప్పుడు మీ ఇంట్లో పని చేసేదాన్ని రమ ని

పాప, బాబు ఎలా ఉన్నారు అండీ బాగున్నారా , సార్ ఎలా ఉన్నారు ?

వంటినిండా నగల తో ఎంతో అందముగా ఉన్నది.

రమా నమ్మలేకపోతున్నాను ఒకప్పుడు సన్నగా, నల్లగా  పీలగా రమ ఇప్పుడు నున్నగా, తెల్లగా

ఆలోచిస్తున్న సరిత  ‘అమ్మా’  అన్న పిలుపుతో .

బాగున్నావా ? ఇక్కడ ఎక్కడ ఉన్నావు? అని అడిగి మళ్ళీ గతం లోకి వెళ్ళింది .

ఎంత సతాయించేదాన్నో దాన్ని

మళ్ళీ కడుగు ఎంగిలి బాగా పోలేదు అని ,శుభ్రముగా కడిగిన గిన్నెలన్నీ మళ్ళీ మళ్లీ  కడిగించేదాన్ని .

ఇల్లు నాలుగుసార్లు కావాలని తుడిపించేదాన్ని.

అదొక శాడిజం లాగా ప్రవర్తించేదాన్ని.

నాలుగుసార్లు తిప్పించుకొని  మరీ నెల జీతం ఇచ్చేదాన్ని.

సరిత  చేసినదంతా గుర్తు ఉన్నదో లేదో తెలియదు కాని

రమ చెప్పుకుంటూ పోతున్నది

మా అబ్బాయి ఇక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా , ఇక వాడి పెళ్లి చేయాలి ,

మా అయన ఇంకా ఆటో నడుపుతూనే ఉన్నాడు  మానమన్నా  మానడు. ఇక్కడ మణికొండ లో ఇల్లు కట్టుకున్నాము అమ్మా,

పిల్లని  అమెరికా అబ్బాయి ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు , అల్లుడు కూడా కొడుకులాగానే చూసుకుంటున్నాడు .

మన భారత దేశం నచ్చి ఇక్కడే మా అమ్మాయితో సెటిల్ అయ్యాడమ్మా. ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాము.

ఇక్కడే అమ్మా, మా ఇల్లు మా ఇంటికి  మీరు ఒక్కసారి రండి

అదే వినయం అదే అమాయకత్వం

తను హైదరాబాద్ లో, భర్త అమెరికాలో, కొడుకు ఆస్ట్రేలియా , కూతురు న్యూజీలాండ్ లో

ఏంటో తన జీవితం పంతాలు పోయి భర్త, కొడుకు కూతురు అందరినీ  దూరం చేసుకుంది

ఇప్పుడే తెలుస్తుంది ఈ  వయసులో ఒంటరితనం

ఇప్పుడే తెలిసింది వెంటనే భర్తతో , పిల్లలతో మాట్లాడాలని

రమని చూస్తుంటే చాలా సంతోషము అనిపించింది సరిత కి

సరిత  పంతం ఏమిటి ?  , పిల్లల్ని దూరం చేసుకొని ఇక్కడ ఏమి చేస్తున్నది?

సరిత పంతం ఆమె వ్యక్తిత్వం . పిల్లలు  వారు కూడా  పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు

వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు , అందుకే ఒక వయసు వచ్చాక వాళ్ళతో బేషజాలు పోకుండా మనం స్నేహితుల్లాగా మెలగాలి.

వాళ్ళ ను , వారి అభిప్రాయాలను గౌరవించాలి

ఒక్క మాట చాలు -ఒక్క సన్నివేశం చాలు- ఒక మనిషి మారటానికి.

ఇప్పుడు సరిత మారింది, ఆమె జీవితం మంచి మలుపే తిరిగింది.

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్