భగవంతుడా కరోన పోయేకాలం?

భగవంతుడా కరోన పోయేకాలం? ఉండేది ఒకే ఒక్క జీవితం  ఈ కరోనా మహమ్మారి తో బుర్ర్రకి పిచ్చి ఎక్కించకు నాయనా

ఈ IPL క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టెన్షన్ వస్తున్నది

ఇంట్లో పెద్దగా కేకలు అరుపులే  కాకుండా కొట్టుకోవటాలు కూడా, 

ముంబై ఇండియన్స్ మాది- రోహిత్ శర్మ మనవాడే, 

ఈసారి చెన్నై సూపర్ కింగ్సే గెలుస్తుంది -ధోని కింగ్ అని,  

కెప్టెన్ గా కోహ్లి మంచి గా ఆడతాడు ,

కే యల్  రాహుల్ సూపర్ నాకు చాలా ఇష్టం

స్థిరంగా ఆడేది ఒక్క కేయల్ రాహుల్ మాత్రమే బామ్మా

పంజాబ్ కి కప్ రావాలి ఈసారన్నా, బామ్మతో చెబుతున్నాడు  ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు.  ఈ కరోనా వచ్చినదగ్గరనుంచి వాడు  కాలేజీ కి వెళ్ళడం లేదు . ఒకవేళ వాడి మూడ్ బాగుండి వెళ్ళాలనుకున్నా బామ్మ వెళ్ళనివ్వదు . ఉన్న ఒక్క నలుసు ఇప్పుడు లేనిపోని వైరస్ రోగాలు వచ్చి మీద పడితే కష్టం, ఏమి అక్కరలేదు ఇంటినుంచి చదువుకుంటాడులే  
ఆ మాత్రం వాళ్ళు చెప్పే చదువులు-చట్టుబండలు ఏముంటాయి అంటుంది  బామ్మ. 

వార్నర్ బాగా ఆడటంలేదని తీసేశారు తాతయ్యా  విలియంసన్ని పెట్టారు కూతురు చెబుతున్నది.

అవును మంచిపనిచేసారు అంటూ  మనవరాలి మాటలను మైమరచి వింటున్నారు మామగారు.

దానికి ఇంటర్ ఫస్టియర్  పరీక్షలు రద్దు చేసారు .

ఇంక చదువు లేదు పాడు లేదు ఇదే గోల

అందరూ కళ్ళు అప్పగించి టీవీ చూస్తున్నారు

ఒకడు కొట్టడం ఒకడు వెయ్యడం

ఎవర్రా సిక్స్ కొట్టింది బామ్మ అడగడం కొడుకు చెప్పడం ,

ఎవరే  బౌల్డ్ చేసింది తాత అడగడం కూతురు చెప్పడం,

ఇదివరకు వాడి ఫ్రండ్స్ తో వాడు, దాని ఫ్రెండ్స్ తో అది చూసేవాళ్ళు

ఇప్పుడు  బయటకు వెళ్ళటం లేదు కదా , బామ్మకి తాతకి క్రికెట్ నేర్పించడం లో బిజీ అయిపోయారు మా పిల్లలు , మా మామగారి అత్తగారి డౌట్స్ తో పిచ్చి ఎక్కుతున్నది అనుకోండి.

ఒకటేమిటి అన్నీ సంగతులు  తెలుసుకొని మరీ చూస్తున్నారు

బామ్మ, అమ్మ,  కొడుకు ఒక టీం,

తాత, నాన్న, కూతురు కలిసి మరో టీం

తొమ్మిదింటికి లేవడం -పదింటికి టిఫిన్ తినడం- 
ఆహ,  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్  లో షోస్, సినిమాలు 
ఒక్క తెలుగు సినిమాలు కాదు , తమిళం, కన్నడం, హిందీ   ఒకటేంటి అన్నీ భాషలలో చూస్తున్నారు 
పింక్ హిందీ చూసారు , ఇప్పుడు తెలుగు వకీల్ సాబ్ చూసారు. 
దాని గురించిన డిస్కషన్స్  మళ్ళీ 

వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ మధ్య మధ్యలో టీవీచూడటం కోసం

హాల్లోకి , గదిలోకి అటూ ఇటూ తిరుగుతూ సతమతమవుతున్నారు  మా వారు .

కరోనా గురించి గాబరాపెట్టే న్యూస్ చానల్స్ తక్కువ చూస్తూ–  ఆటలు , వినోదాన్ని పంచే ఛానల్స్ ఎక్కువ చూస్తున్నాము  ఇంటిల్లపాది

అబ్బబ్బ ఈ కరోనా ఎప్పుడు పోతుందో,

ఎప్పుడు అందరం కలిసి హాయిగా సాధారణమయిన జీవితం గడుపుతామో భగవంతుడా  ??? ఈ భగవంతుడా కరోన పోయేకాలం ఎప్పుడు మొదలయేను…?

తెలుగురీడ్స్

తెలుగులో వ్యాసాలు

తెలుగులో సినిమాలు

తెలుగులో కథలు