బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ

ప్రేమించి పెళ్లి చేసుకున్న సిద్దూ తో కలిసి అత్తగారింటికి వచ్చిన మొదటిరోజు లేఖ మరియు  ఆడబడుచు ల సంభాషణ

ఆడబడుచు : ఏంటి అలా చూస్తున్నావు ?

ఎక్కడ ఉన్నావో అర్ధం అవుతున్నదా  నీకు ?

ఇక్కడ అణిగి మణిగి  ఉండాలి

తేడా వచ్చిందో ఇంక అంతే

నేను ఎంత మంచిదాన్నో  అంత చెడ్డదాన్ని గుర్తుపెట్టుకొని మంచిగా ఉండు.

ఆడబడుచు అంకాలమ్మ( లేఖ   మనసులో పెట్టుకున్న పేరు)  హుకుం జారీ చేసింది .

లేఖ: సరే వదినా ఇంక ఎప్పుడూ నిన్ను చూడను.

నేను  ఎక్కడ ఉన్నానో నాకు  అర్ధం అవుతున్నది.

నువ్వు ఎక్కడ ఉండాలో కూడా త్వరలో నీకు అర్ధం అయ్యేట్లు చేస్తాను.

నేను చీపురు కాదు కదా వదినా ఎక్కడ పడేస్తే  అక్కడ ఉండటానికి

ఏమి తేడాలు వస్తాయి? మీ ఇంట్లో నువ్వు ఉంటావు. నా ఇంట్లో నేను ఉంటాను .

ఎప్పుడైనా వచ్చి పోతూ ఉంటాము . అంతే కదా

నేను కూడా అంత మంచిదాన్ని కాదులే వదినా , నా చెడ్డతనాన్ని అంతగా చూడలేవులే

నేను కూడా తెలుగు సీరియల్స్ చూస్తున్నాను లే  వదినా

నీతో ధీటుగా మాట్లాడటానికి లోక జ్ఞానం కోసం చూడమని సిద్దూ చెప్పాడు లే

తల దించుకొని చెబుతున్న లేఖ ని చూసి రేఖ నవ్వింది.

మనవరాళ్ళ స్కిట్ చూసి బామ్మ నవ్వింది

రేపు పెళ్ళి అయితే ఎలా ఉంటారో అనే బెంగ కూడా తగ్గింది.  

తల్లిదండ్రులు చిన్నపుడే ఆక్సిడెంట్ లో చనిపోతే ఇద్దరు ఆడపిల్లలిని ఈ కాలానికి అనుగుణంగా పెంచి

పెద్దచేసింది. వాళ్ళని ఒక అయ్య చేతిలో పెడితే తను  నిశ్చింత గా ఉండొచ్చుఅని  

తనకు తెలిసిన వారి అందరినీ అడుగుతున్నది పిల్లలకి  సంబంధాల గురించి

వాళ్ళకేమన్నా ముక్కు వంకరా , మూతి వంకరా కనుముక్కు తీరు అందం గా ఉంటుంది

అమ్మాయి లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు, రెండు లక్షలు జీతం  అంటే ఒప్పుకోవటం లేదు

పిల్లవాడి తల్లిదండ్రులు .అమ్మో మాకు ఓల్డ్ ఏజ్ హోం గతి అవుతుంది అని భయపడుతున్నారు.

కోడలు కింద పని చేయాలి అంటున్నారు ,అందరూ అలా ఉంటారా ఏమిటి ,

మా పిల్లలు  అమెరికా లో కూడా చదువుకున్నారు. వాళ్ళ తోటి నేను కూడా వెళ్ళాను. అక్కడ పని అంతా నేర్చుకున్నారు, అని చెప్పినా వినడం లేదు 

తల్లి తండ్రులు లేరుగదా  అత్త మామలని తల్లిదండ్రులు లాగ  ప్రేమ గా చూసుకుంటారు అని కూడా చెప్పింది . ఇంక లాభం లేదని రేఖ ని, లేఖని పిలిచి అడిగారు బామ్మగారు .

మీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పండి , వాళ్ళ తో నేను మాట్లాడతాను అని .

ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని మా మనసులో నువ్వే ఉన్నావు బామ్మా అన్నారు కిలకిలా నవ్వుతూ.

కాసేపు అయ్యాక ,ఒక వారం టైం ఇవ్వు బామ్మా అన్నారు మనవరాళ్ళు ఇద్దరూ.

నాలుగు రోజులు గడిచాక లేఖ జాన్ నీ, రేఖ సామ్ నీ తీసుకొచ్చి బామ్మకి చూపించారు.

అమెరికా లో యూనివర్సిటీ ఫ్రెండ్స్ బామ్మా వీళ్ళు   ,వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి  కూడా మేమంటే ఇష్టం .ఇప్పుడు ఒకేచోట జాబ్ చేస్తున్నాము . నీకు నచ్చితే చేసుకుంటాము

 చెబుతున్న మనవరాళ్ల ను  చూసి మరి ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు ? నేను ఎన్నిసంబంధాలు  చూస్తున్నా మీరు నోరు  విప్పలేదు.ఒకవేళ ఎవరన్నా నచ్చి పెళ్లి చేసుకుంటే ఏమి చేసేవారు ? అన్న బామ్మ ప్రశ్నకి   చేసుకునే వాళ్ళం నువ్వు చెప్పిన నీతి వాక్యాలు అనుసరిస్తూ జీవితం గడిపీవాళ్ళం  అన్నారు ఒకేసారి.   

మీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని నువ్వు అడిగావు కాబట్టి  మేము చెబుతున్నాము అక్కా, నేను అంది రేఖ

మా పది ఏళ్ల వయసులో అమ్మా,నాన్న లకు స్కూటర్ ఆక్సిడెంట్ అయి చనిపోతే, ఆడపిల్లలమని అమ్మ , నాన్నల  తరపు బంధువులు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎదురింట్లో ఉంటున్న నువ్వు

మా కోసం మీ పిల్లలకి కూడా దూరం అయిపోయి మమ్ము మానవత్వం తో చేరదీసి ఇంతవాళ్ళను చేసావు. మా ప్రతి ఆలోచన నీ నుంచి వచ్చిందే , మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నావు .మాతో అన్ని చోట్లా  తిరిగావు, మాకు ఇంత పేరు సంపాదించి పెట్టావు. నీ మాట వినకుండా ఎలా ఉంటాము చెప్పు బామ్మా అని కళ్ళ ల్లో నీరు నింపుకున్నారు ఇద్దరూ.

బామ్మ కు ఆనందంతో నోట మాటలు రాలేదు

తన సొంత కొడుకు గడచిన పదిహీను ఏండ్ల నుంచీ తను కనబడుతున్నా మాట్లాడడు, పిలవడు

కొడుకు కే లేకపోతే కోడలు ఎందుకు చూస్తుంది? తల్లిదండ్రులు దూరమయ్యి ఇద్దరు ఆడ  పిల్లలు తల్లడిల్లి పోతుంటే దగ్గరకి తీసుకుంది , చావు ఇంటికి తనను అడిగి వెళ్లలేదని కోపం తో ఇంటికి రావద్దన్నాడు తన పుత్రుడు . తల్లిదండులు ఇచ్చిపోయిన స్వంత ఇల్లు, ఆస్థి తోనే వాళ్ళు బతికారు ; కష్టపడ్డారు , వాళ్ళకు చేదోడు గా ఉండి  నాలుగు మంచిమాటలు చెప్పింది అంతే .తనను నెత్తిన పెట్టుకున్నారు పిల్లలు. తన మాట కు విలువ ఇచ్చినందుకు బామ్మ కు చాలా గర్వంగా అనిపించింది

బెంగ తీరినట్లు గా అయ్యింది. అయితే అందరం కలిసి  ఉందామని   షరతు పెట్టింది.

బామ్మ బెంగ తీరింది, మనవరాళ్ళ ప్రేమ కుల మతాలకు అతీతంగా పెళ్లి గా మారింది.  

బామ్మ మనవరాళ్ళ కి  చెప్పిన  నీతి వాక్యాలలో ఇది ఒకటి.  “సినిమాలల్లో చూపించినంత మంచిగా మగవాళ్ళు  ఉండరు , అట్లా అని చెడ్డవాళ్ళూ ఉండరు తల్లీ  , మనమే సర్దుకోనిపోవాలి , సగం తగ్గాలి అప్పుడే వాళ్ళు మరో సగం తగ్గి ఉంటారు. ప్రతీదీ సగం సగం అన్నమాట “.

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్