ఆయన మంచేగా చెప్పారు ?

ఆయన మంచేగా చెప్పారు ? కొందరి మాటలు అనుభవంలోకి వస్తే అర్ధం అవుతాయి కానీ వింటున్నపుడు మాత్రం వినసొంపుగా ఉండవు. చిన్ని చిన్ని తెలుగులో కధలు

రమేష్ గారిది చాలా గొప్ప వ్యక్తిత్వం అంటారు అందరూ.

ఆయన ముందు అందరూ బలాదూర్ అంటారు కూడా.

అందుకే ఆయన మాట అలాంటిది ఆయన అలా మాట్లాడటం అందరికీ నచ్చింది.

తొందరగా ఆయన ఇంటి విషయాలు పట్టించుకోరు. కాని ఆయన ఏమి చెబితే అదే జరగాలి, వినాలి   

స్నేహ రమేష్ గారి పెద్ద కోడలు.మామగారి కి ఉన్న పరువు-మర్యాద ,ఆస్థి -అంతస్తు చూసి

తను సంజయ్ ని ప్రేమించింది . ఈ ఇంటి కోడలి గా వచ్చింది.

వచ్చిన దగ్గరనుంచీ , వచ్చే చుట్టాల తాకిడీ, అత్తా మామల  దానాలు , ధర్మాలు

నచ్చడం లేదు . ఉన్న సంపద అంతా ఇలానే పోతే ఇంక మనకి ఏమి మిగులుతుంది?

చాలా సార్లు భర్తతో గొడవ పడింది స్నేహ లాభం లేక పోయింది

ఎప్పుడూ పెద్ద అత్తగారు చిన్న అత్తగారి పిల్లలు ఆడబడుచులు , తోటి కోడళ్ళు, బావగార్లు ,

 వాళ్ళ ఓవర్ ఏక్షన్ లు చూసి చూసీ చిర్రెత్తుకు పోతున్నది , ఛీఛీ  నాకోసమే కన్నారు లాగ ఉంది వీళ్ళని

చికాకు పడుతున్నది స్నేహ  

ఇల్లు ఎప్పుడు చూసినా హౌస్ ఫుల్ , ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు.

అసలు ప్రైవసీ లేదు మాకు మేము వేరే  కొత్త ఇంటికి మారదాం అనుకుంటున్నాము  చెప్పింది అత్తగారితో .

మనది పెద్ద కుటుంబం  నా తరపున, మామగారి తరపున వాళ్ళు వస్తుంటారు వెళుతుంటారు

మనకి, వాళ్ళకి ఏదో బంధం ఉండబట్టీ కదా  వాళ్ళు వచ్చేది

ఒక పిడికెడు మెతుకులు కోసం అంత చార్జీలు పెట్టుకొని , అంతంత ప్రయాణాలు చేసి మన ఇంటికి వచ్చే అవసరం వాళ్ళకి ఎందుకు అమ్మా చెప్పు

నువ్వు పెద్ద కోడలివి నువ్వే ఇలా మాట్లాడితే నీ తర్వాత వాళ్ళు కూడా నిన్నే అనుసరిస్తారు. ఆలోచించుకో

నా తుది నిర్ణయం ఇదే గట్టిగా అంది స్నేహ.

సరే అమ్మా స్నేహా,నువ్వు వెళ్ళు  మా దగ్గర నుంచి మాత్రం నీకు  నయా పైసా రాదు చెబుతున్నా

అలా నీకు  ఇష్టం అయితే ఈరోజే కట్టుబట్టలతో బయటకువెళ్ళు   చెప్పింది అత్తగారు రాధ .

 చాల అవమానం గా అనిపించింది స్నేహకి  

భర్త సంజయ్ ని చూసింది ,

చూసారు కదా ఇక్కడ పరిస్థితి  సొంత కొడుకు కంటే చుట్టాలు వీళ్ళకి ఎక్కువ అయ్యారు

ఒక్క నిముషం కూడా ఉండద్దు ఇక్కడ పదండి వెళదాము మనం  కోపం గా అంది  స్నేహ.

వాడు రాడు తల్లీ నీతో నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఈ ఇంటినుంచి  

కన్నాను, పెంచాను, పెద్దచేసాను , మంచి మనిషి లాగా తీర్చి దిద్దాను .  మా ఆస్థి పెంచటానికి , మమ్మల్ని చూసుకోవడానికి  మాకు మా  కొడుకు ఉండాలి . వాడిని మా దగ్గర నుంచి వేరుచేయడం కుదరదు

ఖరాఖండి గా చెప్పింది రాధ.  నివ్వెరపోయింది స్నేహ

మీరు మీ అమ్మానాన్న ల ను విడిచి రారా ? అడిగింది కటువుగా

సంజయ్  ఇంత అకస్మాత్తుగా తల్లి -భార్యల మధ్య ఈ సంభాషణ ఇలా అంటుంది అని ఊహించలేకపోయాడు.

భార్య తో నీకు ఇక్కడ ఏమి తక్కువయింది అంతలా బాధపడుతున్నావు ?

చుట్టాలు వచ్చినప్పుడు నీకు సంతోషముగా ఉంటే వాళ్ళతో మాట్లాడు లేకపోతే మాట్లాడకు

 నీకు నేను ఏమి తక్కువ చేస్తున్నాను ?అని నువ్వు ఇంట్లోనుంచి వెల్లిపోదాం అంటున్నావు ,

 నాకు అమ్మా నాన్న లే ముఖ్యం ,

నువ్వు నిన్నకాక మొన్న వచ్చిన దానివి నేను ముప్పై ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నాను ,

అమ్మ బాగానే చెప్పింది, నా చెల్లెలు తప్పు చేస్తే  కూడా ఇలానే చెబుతుంది

 మంచి అత్తగారు దొరకడం నీ అదృష్టం . ఇక నీ ఇష్టం . దాదాపు కొట్టినట్లే  చెప్పాడు సంజయ్ .

వీరి అందరి సంభాషణలు వింటున్నారు రమేష్ గారు

దానాలు ,చుట్టాలు -కోడలు కి ఇష్టం లేదు

కోడలు – ఇంటి నుంచి వెళ్ళడం ఇంటికి నష్టం

కొడుకు -కోడలు ను విడిచి ఉండలేడు (ప్రేమ వివాహం కూడా)

భార్య – కొడుకుని విడిచి ఉండలేదు  

ఆలోచించి ఒక నిర్ణయానికి  వచ్చారు .

వాళ్ళందరి  మధ్యలో కి వచ్చి ఇలా అన్నారు

మన కోడలు ఎక్కడికీ వెళ్ళదు ఇక్కడే వుంటుంది ఉండాలి అంతే

కష్టమయినా సుఖమయిన ఇక్కడే ఉండాలి అంతే

అన్నీ అలవాట్లు తొందరగా అవవు

మనకు ఇష్టం లేనివి అసలే అవవు

అలవాటు చేసుకోవాలి , తప్పదు

ఎవరో తప్ప చుట్టాలు అనబడే వారు రోజుల తరబడి ఉండరు ,

ఎవరూ లేకపోతే , రాకపోతే మనం ఉండి కూడా లేనివారితో సమానం

ఇంటికి వచ్చిన వారికి  తిండి పెట్టడం కూడా దానం అంటే నేను ఒప్పుకోను.

మా చిన్నపుడు పది మంది ఇంటికి వచ్చిపోతుంటే శ్రీమంతుడు అనే వాళ్ళు

ఆ సంపంద ని అలానే ఉండనివ్వు తల్లీ  ఇప్పుడు నువ్వు వచ్చి  చెడగొట్టకు

కోపం తెచ్చుకోకు నిదానం గా ఆలోచించు

అప్పటికీ నీకు మనసుకు ప్రశాంతత లేకపోతే కొన్ని రోజులయ్యాక ఆలోచిద్దాము

కాలం అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది

ఇక ఈ విషయములో ఎవరూ మాట్లాడకుండా ఎవరి పనులు వారు చేసుకోండి.

చెప్పి వెళ్లారు రమేష్ గారు

తర్వాత కొద్ది కాలానికి స్నేహ ఆలోచనలో మార్పు వచ్చింది

అందరితో కలిసి మెలిసి ఉండటం అలవాటు అయ్యింది

మనం ఎప్పుడూ కూడా కలిపి ఉంచటానికి ప్రయత్నించాలి.

ఆనందముగా ఉండటం , తోటివారికి ఆనందం విలువ చెప్పటం  

ఈ తరానికి నేర్పించాలి అంటారు రమేష్ గారు

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్