అత్తమ్మా-ఏంటిది ?

అత్తమ్మా-ఏంటిది ? అనుకుంటూ “మా అత్తమ్మ తో చస్తున్నా” అని తలిచే కోడలి మనసు చెప్పే కధ

ఈ కరోన ఏమో గాని ఇల్లు చిమ్మి, అంట్లు కడిగి, వంట చేసీ , బట్టలు ఆరేసి , నేను అలసి సొలసి కాసేపు ఏదో సీరియల్ చూద్దామని అనుకుంటే

ఆమె రిమోట్ ఇవ్వదు

ఎవరి ఇంట్లో అయినా ఆస్తులు -అంతస్తులు  కోసం  కొట్టుకుంటారు.

మా ఇంట్లో రిమోట్ కోసం కొట్టుకుంటాం

మా ఆయన , మా అత్తమ్మ ,  నేను ఉండేది ముగ్గురం లింగు-లిటుకు మని  పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి విదేశాలలో ఉంటున్నారు వారి జీవితం వారిది

మేము ముగ్గురం  ఒక రోజు ఒక టైం టేబుల్ రాసుకున్నాము

మేము టాస్  వేసుకొని మరీ ఈ రోజులు ఫిక్స్ చేసుకున్నాం 

సోమ , మంగళ, బుధ  వారాలు మా అత్తమ్మ రోజులు.

గురు,శుక్ర  వారాలు నా రోజులు.

శని, ఆది వారాలు మా ఆయనవి . అవి కాకుండా IPL-క్రికెట్ మ్యాచ్ రోజుల్లో సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉంటారు ఆ రోజులు  కూడా ఆయనవే.

పేరుకు వారాలు ఫిక్స్ చేసుకోవటమే , ఎప్పుడూ అత్త, భర్త గారి దగ్గరే ఉంటుంది టీవీ రిమోట్.

అత్తమ్మ ఒకరోజు తిండి పెట్టక పోయినా  ఏమి అనదు కాని రిమోట్ తీసుకుంటే మాత్రం పెద్ద గోలే , ఇల్లు తీసి పందిరి వేస్తుంది.

నాకు మనవడు, మనవరాలు ఉన్నా కూడా ఇంకా మా పెళ్ళిలో కందిపొడి వడ్డన మర్చిపోయి చేయలేదని పెద్దగా చుట్టుపక్కల ఫ్లాట్స్ కి  వినపడేలా అరుస్తుంది .

ఎందుకొచ్చిన గోల రా దేవుడా అని ఆమె దగ్గర రిమోట్ తీసుకోను .

నా దరిద్రానికి తోడు కరెక్ట్ గా కార్తీకదీపం, కృష్ణ తులసి సీరియల్స్ అప్పుడే పవర్ పోతుంది.

నేను ఏదో ఆప్స్  డౌన్లోడ్ చేసుకొని ఈ సీరియల్స్ అన్నీ ఎలాగోలా చూస్తూ ఉంటా . దాని మీద కూడా కన్ను వేసింది ఆమె .

నాకు ఒక ఐ-ఫోన్ కొని పెట్టమని వాడికి చెప్పవే ,నేను కూడా అన్ని  సీరియల్స్  ఫోన్ లో నే చూసుకుంటాను అని నన్ను చంపుతున్నది ఒక నెలరోజులుగా .

ఆయన చెవిన పడేసాను ఈ విషయం . కస్సు మని లేచారు . అమ్మకు బుద్ధి లేకపోతేమాను నీకు కూడా పోయిందా ఏమిటి ? ఫోన్లు పిల్లలకు వద్దు అనుకుంటుంటే ఎనభయ్యో ఏట అడుగుపెడుతుంది ఆమెకి కావాలా , బుర్ర కాస్త వాడండి ఇంట్లో అని అరిచి నన్ను కొట్టినంత పని చేసారు..

చూసారుగా అత్తమ్మా ఎలా మాట్లాడారో మీ అబ్బాయి , ఇప్పుడు ఈ వయసులో ఆయనతో దెబ్బలెందుకు  ,పొరుగువారి  ముందు నా పరువు పోతుంది , నేను చూసే  గురు, శుక్ర వారాలు  కూడా మీరే తీసుకోండి అన్నాను నెమ్మదిగా . అవునే చూస్తున్నాను అంతా , నాకు ఫోన్ ఎందుకు కొనివ్వరు ? నేనే అడుగుతాను వాడిని ,నాకేమన్నా  భయమా ఏంటి ? నీకు  మీ అబ్బాయి ఫోన్ కొని పెట్టాడుగా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు .

టీవీ పెడితే పెద్దగా పెట్టావు చెముడా ? అంటారు ,

 నాకు కూడా ఫోన్ కావాలి. ఇలా ఎంతసేపు  సోఫా లో కూర్చుని చూస్తా ?

నేను కూడా  మంచం మీద పడుకొని హాయిగా చూస్తాను  అని కేకలు పెట్టింది .

ఇదేంటి రా నాయనా ఈ కష్టాలు  అని అప్పటికి మాట్లాడకుండా వెళ్ళిపోయాను.

మర్నాడు పెద్ద పెద్ద అరుపులు, కేకలు, కాఫీ గ్లాస్, వాటర్ బాటిల్ కిందపడేసిన శబ్ధాలతో , మొత్తం మీద మనవడి తో వీడియో లో మాట్లాడి  కాస్త చల్లబడింది. అమ్మయ్య నా కొడుకు బామ్మని ఫోన్ వద్దని  ఒప్పించాడు  అనుకునే లోపులోనే ,

నీ కొడుకు నీకే కాదు నాకు కూడా ఫోన్ పంపిస్తున్నాడు , నిన్నే నేర్పమన్నాడు . అని చెబుతున్న మా అత్తమ్మ సంబరాన్ని  చూసి చేష్టలుడిగి నిలబడిపోయాను.

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్