ఆనందమే అందం

ఆనందమే అందం అది మనసుతో ముడిపడి ఉంటుంది.

ఎందుకంటే, అలాంటి వారు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంతో ఉంటారు.

వారి చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండడానికి కారణం అవుతారు. అలాంటి ఒక వ్యక్తి కధ ఇది…

నేను మొదట మామూలుగా ఎప్పుడూ ఫోన్, టీవీ చూస్తూ , వంట చేస్తూ ఏదో రొటీన్ జీవితం గడిపేదాన్ని.

కానీ మనసు ఆక్టివ్ గా ఉండేది కాదు సమయం  జరిగిపోతుంది

ఎప్పుడూ ఈదురోమని ఉంటావేంటీ , ఏదో   ఒక పని చెయ్యి ఆక్టివ్ గా ఉంటావు అని మా అత్తగారు  చెప్పేవారు  

ఇలా ఎందుకుండాలి ? ఏమన్నా చేద్దాము అనుకుని ఈ పని చేస్తున్నాను

ఇందులో అందం ఉంది ఆనందం ఉంది మనసు సంతోషముగా ఉంది.  

 నేను   చూడండి ఏమిచేసానో – మొదట రెండు మట్టి  కుండీలు తెచ్చి, సమం గా మట్టి వేసి  ఆకుకూరల గింజలు  వేసి చూసాను.

వారములో మొలకలు వచ్చి కుండీ అంతా ఆకుపచ్చ గా అయింది. మరో నెలలో మొక్కలు ఫై కి  రావడం మొదలు అయింది .

ఒక కుండీ లో కొత్తిమీర, మరొక కుండీలో బచ్చలాకు వచ్చాయి .

మరో పది రోజులకి మా అత్తగారు బచ్చలి కూర పప్పు, కొత్తిమీర పచ్చడి చేసారు .

చాలా సంతోషం అనిపించింది . అలా మొదలయిన నా అలవాటు ఒక చిన్న తోట ను పెంచే దిశగా మళ్ళింది 

ఇప్పుడు నేను మా  అపార్ట్ మెంట్ లో చాలా మందికి కూరగాయలు ఇస్తున్నాను 

. మీరు కూడా రోజూ ఏదో ఒక పని చేయడం అలవాటు చేసుకోండి .

మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్ళు పోయడం,పాదు చేయడం, కూరలు కోయడం , పూలు కోయడం , దేముడికి మాల కట్టడం,

ఇలా ఎన్నో ఎన్నెన్నో పనులు చేయొచ్చు అస్తమానం పడుకోకుండా అనవసరముగా టీవీ లు చూడకుండా , కాస్త ఒళ్ళు కదిలే పనులు చేస్తే మనకు ఆనందం , కాదంటారా

చెప్పడం చాలా సులభం అనుకుంటారు అందరూ ,

కాని చెప్పడమే కష్టం -వినడం చాలా సులభం,

విని ఆ పని చేయడం  మరీ కష్టం

మీరు కూడా ఆనందం గా , అందం గా ఉండాలంటే మీకు ఇష్టమయిన పనులు చేయండి

 

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్